Coronavirus updates in Kerala: కేర‌ళలో క‌రోనా క‌ల్లోలం

Coronavirus updates in Kerala: కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాలు సంభవిస్తుండడం ప్ర‌జ‌ల్లో ఆందోళన క‌లిగిస్తుంది.

Update: 2020-08-08 15:46 GMT
Coronavirus updates in Kerala

Coronavirus updates in Kerala: కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాలు సంభవిస్తుండడం ప్ర‌జ‌ల్లో ఆందోళన క‌లిగిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 1,420 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,715 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా, నలుగురు మృత్యువాడ ప‌డ్డారు.

జిల్లాల ప్ర‌కారం కేసుల వివ‌రాలు..

కోజికోడ్ జిల్లాలో 173, అలప్పుజ జిల్లాలో 169, మలప్పురం జిల్లాలో 114, ఎర్నాకుళం జిల్లాలో 101, కాసర్గోడ్ జిల్లాలో 73, త్రిస్సూర్ జిల్లాలో 64, కన్నూర్ జిల్లాలో 57, కొల్లం జిల్లాలో 41, ఇడుక్కి జిల్లాలో 41, పాలక్కాడ్ జిల్లాలో 39, పతనమిట్ట జిల్లాలో 38, కొట్టాయం జిల్లాలో 15, వయనాడ్ జిల్లాలో 10 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇదిలా ఉండగా దేశంలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61,537 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 933 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

Tags:    

Similar News