Corona Updates in AP: ఏపీలో కరోనా క‌ల్లోలం.. ఒక్క రోజే 97 మంది మృతి

Corona Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా, శనివారం హెల్త్‌ బులిటెన్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి.

Karampoori Rajesh
Published on: 8 Aug 2020 8:12 PM IST
Corona Updates in AP: ఏపీలో కరోనా క‌ల్లోలం.. ఒక్క రోజే 97 మంది మృతి
X
Representational Image

Corona Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా, శనివారం హెల్త్‌ బులిటెన్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. అలాగే 24 గంటల్లో రికార్డు స్థాయిలో 97 మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,939కు చేరింది. గడిచిన 24 గంటల్లో 62,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 10,080 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,17,040కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,15 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,29,615కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 24,24,393 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 85,486 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 976, చిత్తూరులో 963, గుంటూరులో 601, తూర్పు గోదావరిలో 1310, కడపలో 525, కృష్ణాలో 391, కర్నూలులో 1353, నెల్లూరులో 878, ప్రకాశంలో 512, శ్రీకాకుళంలో 442, విశాఖలో 998, విజయనగరంలో 450, పశ్చిమ గోదావరిలో 681 కేసులు నమోదయ్యాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చిన వారిలో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story