Coronavirus Updates in India: భారత్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు

Update: 2020-08-27 04:16 GMT

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 33 లక్షల 10 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 75,760 కేసులు నమోదు కాగా, 1023 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 56,013 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 33,10,234 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,25,991 ఉండగా, 25,23,771 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 60,472 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.24 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.83 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.93 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో 9,24,998 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,85,76,510కి చేరింది.

Tags:    

Similar News