ఇటలీ నుంచి 211 మంది భారత్ విద్యార్థుల తరలింపు

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విమానాలను రద్దు చేసింది ఇటలీ ప్రభుత్వం. దాంతో అక్కడ చిక్కుకున్న 211 మంది భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం శనివారం భారతదేశానికి బయలుదేరింది.

Update: 2020-03-15 02:44 GMT
special air India flight with 211 Indian students takes off from Milan

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విమానాలను రద్దు చేసింది ఇటలీ ప్రభుత్వం. దాంతో అక్కడ చిక్కుకున్న 211 మంది భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం శనివారం భారతదేశానికి బయలుదేరింది.మిలన్ నుండి బయలుదేరిన ఈ విమానంలో ఏడు అనుమానిత కేసులు కూడా ఉన్నాయి. వారికోసం ప్రత్యేక వైద్య సిబ్బంది 50 మంది దాకా ఉన్నారు. విమానంలో ఉన్నంత సేపు ప్రయాణికులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేశారు.

తేలికపాటి ఆహారాన్ని మాత్రమే వారికి ఇచ్చారు. ఇక వారిని రాజస్థాన్ లోని జైసల్మేర్ లేదా ఢిల్లీకి సమీపంలో ఉన్న ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందించనున్నారు. ఇదిలావుంటే ఇటలీలో శనివారం కరోనావైరస్ ద్వారా మరో 175 మంది మరణించారు.. దాంతో ఆ దేశంలో మొత్తంగా మరణించిన వారి సంఖ్య 1,411 కు చేరింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ఏప్రిల్ 30 వరకు కువైట్, ఇటలీకి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా గతంలో ప్రకటించింది.

గత కొన్ని వారాలలో భారత్ అనేక దేశాల నుండి తరలింపులను చేపట్టింది. ఈ దేశాలలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నందున చైనా, జపాన్ మరియు ఇరాన్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకువచ్చింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనావైరస్ వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించి, చైనా తరువాత ప్రాణాంతక వైరస్ యొక్క కొత్త కేంద్రంగా యూరప్ ఉందని ఆ తరువాత భారతదేశానికి కూడా వ్యాపించిందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

భారత్ లో 91 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం శనివారం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించింది. అంతేకాదు రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్‌-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక కరోనావైరస్ ద్వారా ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.. దాంతో మరణించిన వారి కుటుంబాలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రూ .4 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించింది.


Tags:    

Similar News