Coronavirus Effect: రాజస్తాన్‌లో యూజీ, పీజీ పరీక్షలు రద్దు

Coronavirus Effect: కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్రలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు..

Update: 2020-07-05 17:22 GMT
Ashol Gehlot (file photo)

Coronavirus Effect: కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్రలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు సాంకేతిక విద్యాసంస్థలలోని అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా మహారాష్ట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తన ట్విటర్‌లో ఈ విషయాన్నీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలతోపాటు టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా వర్తిస్తుందని అయన తెలిపారు.

ఈ ఏడాది విద్యార్థులందరూ పరీక్షలు లేకుండా పదోన్నతి పొందుతారని, అంతేకాకుండా విద్యార్థుల మార్కులకు సంబంధించిన జాబితాను భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక రాజస్తాన్ లో డీగ్రీ , పిజి పరీక్షలని జూలై 15 నుండి ఆగస్టు 18 వరకు జరుగుతాయని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడింది.

ఇక రాజస్థాన్‌లో ఆదివారం రోజున కొత్తగా 224 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 19,756కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనని విడుదల చేసింది. అటు కోవిడ్ -19 పరీక్ష సామర్థ్యాన్ని రోజుకు 41,000 శాంపిల్స్‌కు పెంచామని, త్వరలో దాన్ని 50,000 కు పెంచనున్నట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి డాక్టర్ రఘు శర్మ తెలిపారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల విషయనికి వచ్చేసరికి శనివారం ఒక్కరోజే 24,850పైగా కేసులు నమోదు కాగా, 613 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదయిన కరోనా మరణాల్లో రెండో అత్యధికం..క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 60శాతంగా ఉండ‌గా మ‌ర‌ణాల రేటు 2.9శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 6,73,165గా చేరగా.. మరణాల సంఖ్య 19,268మందికి చేరింది. కరోనా నుంచి 4.09 లక్షల మంది కోలుకోగా.. 2,44,814లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Tags:    

Similar News