Coronavirus declines in northeast states: ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం..

Coronavirus declines in northeast states: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య భారతదేశంలో కరోనా కేసులు ప్రస్తుతం నియంత్రణలో ఉన్నాయి. ఈ అంటువ్యాధిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం మరియు ప్రజల క్రమశిక్షణకు ఇది అద్దం పడుతుంది

Update: 2020-07-09 08:42 GMT
Coronavirus declines in northeast states: northeast states are now coronavirus-free

Coronavirus declines in northeast states: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య భారతదేశంలో కరోనా కేసులు ప్రస్తుతం నియంత్రణలో ఉన్నాయి. ఈ అంటువ్యాధిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం మరియు ప్రజల క్రమశిక్షణకు ఇది అద్దం పడుతుంది. జూలై 5 నాటికి 37 లక్షల జనాభా కలిగిన మేఘాలయలో మొత్తం 70 కేసులు నమోదయ్యాయి. ఇందులో 43 మంది కోలుకొని తమ ఇంటికి వెళ్లగా, ఇప్పటివరకు ఒకరు మాత్రమే మరణించారు.

కరోనాపై మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ.. కరోనా విషయంలో జాతీయ లాక్డౌన్ కంటే ముందు తాము అప్రమత్తం అయ్యామని అన్నారు. ఈ అంటువ్యాధి యొక్క భయాన్ని ఎదుర్కోవటానికి సన్నాహాలు ప్రారంభించామని.. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున చేయవలసిన అన్ని పౌలు సమర్థవంతంగా చేయగలుగుతున్నామని అన్నారు.

అలాగే సామాజిక దూరం తోపాటు ప్రజలు ఖచ్చితంగా మాస్కులను ధరించేలా చర్యలు చేపట్టామన్నారు. వీటిని అనుసరించడానికి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించామని.. ఈ విధంగా చేస్తే కరోనా ప్రారంభమైన మూడు వారాల పాటు రాష్ట్రంలో ఒకే ఒక కేసు ఉందని.. ఎప్పుడైతే ప్రజలు బయటికి రావడం ప్రారంభిచారో అపుడే కేసులు పెరగడం ప్రారంభం అయిందని అన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం , మేఘాలయలో రికవరీ రేటు 89.1% గా ఉంది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ సంక్రమణలను అస్సాం నివేదించింది. ఇక్కడ జూలై 5 నాటికి కరోనా రోగుల సంఖ్య 11,736 కు చేరుకుంది. ఆరోగ్య శాఖ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 7433 మంది రోగులు నయమయ్యారు. కాగా 14 మంది మరణించారు.


Tags:    

Similar News