భారత్ లో పంజా విసురుతోన్న కరోనా వైరస్.. పెరిగిన కేసుల సంఖ్య..

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 369 కు చేరుకున్నాయని.. గడిచిన 24 గంటల్లోనే 80కిపైగా కేసులు నమోదయ్యాయి.

Update: 2020-03-23 05:05 GMT
Coronavirus

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 369 కు చేరుకున్నాయని.. గడిచిన 24 గంటల్లోనే 80కిపైగా కేసులు నమోదయ్యాయి.ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య గత 24 గంటల్లో బాగా పెరిగింది, రాష్ట్ర అధికారులు 15 కొత్త కేసులను నివేదించారు. వీరిలో 14 మంది ముంబైలో పూణేలో 1 మందికి కోవిడ్ -19 పాజిటివ్ పరీక్షలు చేశారు.

15 మందిలో 8 మంది ఇంతకు ముందు పాజిటివ్ పరీక్షించిన వ్యక్తుల పరిచయస్తులని అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో మార్చి 23 నాటికి, మహారాష్ట్రలో మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య 89 గా ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే 1897 ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ను ప్రవేశపెట్టారు, ఇందులో భాగంగా అన్ని అనవసర సేవలు మరియు వ్యాపారాలను మార్చి 31 వరకు నిలిపివేయాలని ఆదేశించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనాపై హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. అందులో విదేశాల నుంచి 13301 మంది వచ్చారని.. వారిలో 11,206 మంది స్వీయనిర్భందంలో ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 2222 మందికి హోమ్‌ ఐసోలేషన్‌ పూరైనట్లు.. మరో 11026 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ వైద్యులు 178 శాంపిళ్లను పరీక్షించగా 150 శాంపిళ్లు నెగిటివ్‌ వచ్చాయి. మరో 22 శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 27కు చేరింది. ఆదివారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక ప్రస్తుతం, భారతదేశంలో కోవిడ్ -19 మరణాల సంఖ్య మహారాష్ట్రలో రెండు, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ మరియు బీహార్లలో ఒకటి ఉన్నాయి. ఇదిలావుంటే దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న 75 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం.. వచ్చే రెండు రోజుల్లో మరిన్న కఠిన నిర్ణయాలను తీసుకోనుంది. రోజు రోజుకూ వైరస్ తీవ్రంగా పెరుగుతుండటంతో మహమ్మారిని కట్టడిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. 

Tags:    

Similar News