కరోనా వాక్సిన్ వచ్చింది.. కానీ.. ?

Update: 2021-01-12 13:02 GMT

Representational image

ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న సమయం వచ్చేసింది. బారులు తీరిన ట్రక్కులు వ్యాక్సిన్ ను మోసుకుంటూ రాష్ట్రాల ముంగిట నిలిచాయి. ఇక పంపిణీయే మిగులుంది. ఫలితాలపైనా అంచనాలు ఉన్నాయి. ఫలిస్తుందా వికటిస్తుందా అన్న అనుమానాలు, శంకలు, సంశయాలే వద్దంటున్నారు నిపుణులు. దేశీయంగా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లే మనకు అన్ని రకాలుగా మేలంటున్నారు. వెలకమ్ వ్యాక్సిన్ అంటూ ఆహ్వానిస్తున్నారు.

భయం గుప్పిట్లో దేశం ఏడాదిగా నలిగిపోయింది. ఏం జరుగుతుందో కరోనా ఎప్పుడు ఎలా కాటేస్తుందో తెలియని భయం వెంటాడింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. మంచాన పడిసి కుటుంబాలకు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరూపంలో పొంచి ఉండి కాటేస్తూనే ఉంది. రూపాలు మార్చుకుని కొత్త కొత్త వైరస్ గా తొంగి చూస్తూనే ఉంది. ఈ క్రమంలో మహమ్మారిని తరిమి కొట్టేందుకు పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడో ధైర్యం. ఓ భరోసా ఇక ఉపశమనం దొరికిందన్న ధీమా.

వ్యాక్సిన్ వచ్చింది సరే. ఇది ఎంత వరకు సురక్షితం. ఎంత వరకు రక్షణ ఇస్తుంది. ఇవే ప్రశ్నలు ఇప్పుడు అనేక మందిని తొలుస్తున్నాయి. అయితే వైద్య నిపుణులు మాత్రం అపోహలే వద్దంటున్నారు. మంచి ఫలితాలు ఉంటాయని భరోసా ఇస్తున్నారు. అన్ని రకాల ట్రైల్స్ అయ్యాకే పంపిణీకి సిద్ధం చేశారని చెబుతున్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది సరే దీనిని ఎలా స్టోర్ చేయాలి? ఎంత ఉష్టోగ్రత్తల వద్ద నిల్వ ఉంచాలి. అది మనకు సాధ్యమేనా? టీకాలు వేసుకున్న వారందరికీ యాంటీ బాడీలు తయారవుతాయా? అలా కాకుంటే ఏం చేయాలి అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News