Covid: దేశంలో కోవిడ్ డేంజర్ బెల్స్..ఒక్కరోజే 564 మందికి పాజిటివ్..5 నెలల చిన్నారి మృతి
Covid: దేశంలో కోవిడ్ డేంజర్ బెల్స్..ఒక్కరోజే 564 మందికి పాజిటివ్..5 నెలల చిన్నారి మృతి
Covid: గత కొన్ని రోజులుగా భారత్ లో కోవిడ్ వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో ఐదువందల కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 8గంటల నుంచి గురువారం ఉదయం 8గంటల వరకు కొత్తగా 564 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 4, 866కి చేరుకుంది. అత్యధికంగా కేరళలో 1487 కేసులు నమోదు అవ్వగా ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్లో 538, మహారాష్ట్రలో 526, గుజరాత్ లో 508, కర్నాటకలో 436, తమిళనాడులో 213కేసులు నమోదు అయ్యాయి.
గత 24గంటల్లో ఏడు మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో 5 నెలల చిన్నారి సహా ఇద్దరు మరణించారు. కర్నాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు కోవిడ్ వైరస్ తో మరణించిన వారి సంఖ్య 51కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 3, 955 మంది డిశ్చార్జ్ అయ్యారు.