Corona Virus: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా...
Corona Virus: గడిచిన 24 గంటల్లో 6.70లక్షల పరీక్షలు చేయగా..కొత్తగా 14,264 కరోనా కేసులు నమోదు కాగా 90 మంది మరణించారు.
ఇమేజ్ సోర్సు: thehansindia
Corona Virus: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల్లో వరుసగా రెండో రోజు పెరుగుదల కనిపించింది గడచిన 24 గంటల్లో 6.70లక్షల పరీక్షలు చేయగా.. కొత్తగా 14,264 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం కొత్తగా నమోదైన 14,264 కరోనా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1,09,91,651 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 90 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,56,302కు చేరుకుంది. ప్రభుత్వ ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాల ప్రకారం 1,06,89,715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,634 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,302కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,45,634 తగ్గింది. ఇక మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది.