Corbevax Vaccine: వ్యాక్సినేషన్ అందించేందుకు కేంద్రం చర్యలు
Corbevax Vaccine: బాలలకు అందించేందుకు మరో వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్
Corbevax Vaccine: వ్యాక్సినేషన్ అందించేందుకు కేంద్రం చర్యలు
Corbevax Vaccine: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను అన్ని వయసుల వారికి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బాలలకు అందించేందుకు మరో వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాదుకు చెందిన ఫార్మా పరిశోధన సంస్థ 'బయోలాజికల్ ఈ' అభివృద్ధి చేసిన 'కోర్బెవాక్స్' కరోనా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి 'కోర్బెవాక్స్' అత్యవసర వినియోగానికి DCGI ఆమోదం తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి భారత్ బయోటెక్ తయారుచేసిన 'కొవాగ్జిన్' ను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాలల కోసం దేశంలో 'కోర్బెవాక్స్' రూపంలో రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టయింది.