Gas Price Hike: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

Gas Price Hike: ఇంటి అవసరాలకు ఉపయోగించే సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.84ల ధరలు పెంచాయి.

Update: 2021-07-01 05:24 GMT

Cooking Gas Price Hiked Again

Gas Price Hike: గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు మరసారి పెంచాయి. ఇంటి అవసరాలకు ఉపయోగించే సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.84ను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు సెలవిచ్చాయి సదరు కంపెనీలు.

గత ఆరు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.140 పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న తొలిసారిగా సిలిండర్ ధరను రూ.25 పెంచారు. ఆ తరువాత ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25న రూ.25లు పెరిగింది. ఆ నెలలో మొత్తం గ్యాస్ ధర రూ.100 పెరిగింది. ఇక మార్చి1న మరో రూ.25 పెంచారు. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఏప్రిల్ 1న వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 10 తగ్గించారు.

అస్సలే కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యి ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలం అవుతున్నారు. ఓ వైపు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నయి. చమురు దరలు మండిపోతున్నాయి. ఇంకో వైపు గ్యాసు ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచేస్తున్నారు.

Tags:    

Similar News