Lok Sabha Elections 2024: నేడు సీడబ్ల్యూసీ భేటీ.. మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్న నేతలు

Lok Sabha Elections 2024: 5 న్యాయాల పేరిట మేనిఫెస్టోతో ప్రజల ముందుకు కాంగ్రెస్‌

Update: 2024-03-19 04:09 GMT

Lok Sabha Elections 2024: నేడు సీడబ్ల్యూసీ భేటీ.. మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్న నేతలు

Lok Sabha Elections 2024: ఢిల్లీలో ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు కీలక నేతలందరూ హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు నేతలు. ఐదు న్యాయాల పేరిట ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రానుంది కాంగ్రెస్. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది కాంగ్రెస్. మేనిఫెస్టోలో పొందుపరిచే ప్రతి విభాగంలో 5 చొప్పున గ్యారెంటీలు ఉండే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

మరో వైపు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదే సమావేశంలోనే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు విడతలుగా 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినన కాంగ్రెస్.. ఇవాళ జరిగే సమావేశంలో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. 

Tags:    

Similar News