Karnataka: ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు.. కాంగ్రెస్ హామీ
Karnataka: కోటి మందికి ప్రయోజనమన్న ప్రియాంక గాంధీ
Karnataka: ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు.. కాంగ్రెస్ హామీ
Karnataka: కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని బయటకు తీసింది. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనుండగా.. తాము అధికారంలోకి వస్తే ప్రతి గృహిణికి రెండు వేల రూపాయలు ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు AICC జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనివల్ల కోటి మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ఇప్పటికే హస్తం పార్టీ హామీ ఇచ్చింది.