Hardeep Dang: రాజ్యసభ ఎన్నికలముందు కాంగ్రెస్ కు షాక్.. ఎమ్మెల్యే రాజీనామా

Update: 2020-03-06 02:38 GMT

మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్దీప్ సింగ్ డాంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామాను స్పీకర్‌కు పంపారు. ఇటీవల, డాంగ్ సహా 10 మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారు, ఈ ఎమ్మెల్యేలను బిజెపి తన శిభిరంలో ఉంచినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అయితే వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు తిరిగి వచ్చారు, కాని మరో నలుగురు తిరిగి రాకుండా బీజేపీ శిబిరంలోనే ఉండిపోయారు.

అయితే ఈ తరుణంలో డాంగ్ గురువారం రాత్రి స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతికి తన రాజీనామాను పంపించడం కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే రాజీనామా అనంతరం మాట్లాడిన డాంగ్ మాండ్‌సౌర్‌లోని సువాస్రా నుంచి తాను రెండోసారి ఎన్నికైనప్పటికీ, తన రాజీనామాకు కారణాలు మంత్రి, అధికారులు తన మాట వినక పోవడమే అని ఆయన పేర్కొన్నారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేను బుజ్జగించే పనిని సీనియర్ నేతలు చూస్తున్నారు. అయితే తనకు హామీ ఇస్తే గాని రాజీనామా వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభానికి బీజేపీయే కారణమని.. రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసిందని.. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి కుట్ర పన్నిందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ ఆరోపించారు. అయితే ఈ సమస్యను రాజకీయంగానే ఎదుర్కొంటామని ఆయన అన్నారు. 10 మంది తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే మేము ఈ ప్రక్రియను అడ్డుకున్నాము.. ఎమ్మెల్యేలకు మూడు విడతలుగా డబ్బు ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు.

మొదటి విడత ఇప్పుడు 5 కోట్ల రూపాయలు, రెండవది రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆ తరువాత మూడవ విడత బల పరీక్ష నెగ్గిన అనంతరం ప్రభుత్వాన్ని కూల్చివేస్తే.. మొత్తం ఆఫర్ ఒక్కొక్కటి 50 కోట్ల రూపాయలు అని దిగ్విజయ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇక బహుజన్ సమాజ్ వాది పార్టీకి చెందిన రమాబాయి ఇప్పటికే తిరిగి వచ్చారని, ఇతరులు రావాలని అనుకుంటున్నారు.. కానీ బిజెపి ఎమ్మెల్యేలను ఆపడానికి ప్రయత్నిస్తోంది. అని దిగ్విజయ్ ఆరోపించారు. 

Tags:    

Similar News