Priyanka Gandhi: బికినీ, ఘంఘటా, హిజాబ్ ఏది ధరించినా మహిళల ఇష్టమన్న ప్రియాంక గాంధీ
Priyanka Gandhi: హిజాబ్ విషయంలో మహిళలను వేధించడం ఆపాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు
Priyanka Gandhi: మహిళలపై వేధింపులు ఆపండి.. హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆగ్రహం
Priyanka Gandhi: హిజాబ్‌పై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. ఇవాళ మళ్లీ హైకోర్టు ధర్మాసనం వాదనలు విననున్నది. తాజాగా హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రస్ పేరిట మహిళలను వేధించడం ఆపాలని డిమాండ్ చేశారు.
బికినీ, గుజరాతీ మహిళలు ధరించే ఘంఘటా, జీన్స్, హిజాబ్.. ఏది ధరించాలన్నా.. మహిళ ఇష్టమేనని ప్రియాంక స్పష్టం చేశారు. మహిళ తనకు ఇష్టమైన దుస్తులను ధరించే హక్కును రాజ్యాంగం కల్పించదని స్పష్టం చేశారు. హిజాబ్ విషయంలో మహిళలను వేధించడం ఆపాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.