Rajasthan Political Crisis Updates: సచిన్ పైలట్ కాంగ్రెస్ తో ఉండాలంటే ఇలా చేస్తే సరి..

Update: 2020-07-26 08:34 GMT

Rajasthan Political Crisis Updates: రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ అల్వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, అశోక్ గెహ్లాట్ క్యాంప్, సచిన్ పైలట్ క్యాంప్ మధ్య పోరాటం కాంగ్రెస్ యొక్క అంతర్గత సమస్య అని అన్నారు. దీనిపై వీలైనంత త్వరగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కల్పించుకోవాలి అన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఇద్దరినీ ఒక కప్పు టీ కి ఆహ్వానించి సమస్యను సద్దుమణిగేలా.. వారి మధ్య విభేదాలను పరిష్కరించాలని ఆమె సోనియాగాంధీకి సూచన చేశారు.

సచిన్ పైలట్ తాను పార్టీని వీడటం లేదని చాలా స్పష్టంగా చెప్పడాన్ని మార్గరెట్ అల్వా.. సచిన్ అస్ఫతృప్తికి కారణాలను కనుక్కోవాలని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే ఉద్దేశ్యం సచిన్ పైలట్ కు లేదని.. తాను అనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే సచిన్ ఇప్పటికే తాను బిజెపికి వెళ్ళడం లేదని తెగేసి చెప్పారు.. ఇన్ని ప్రకటనలు సచిన్ నుంచి వచ్చిన తరువాత కూడా గవర్నర్‌కు లేదా న్యాయస్థానాలకు ఎటువంటి పాత్ర ఉండదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఈ సమస్య పార్టీ అధ్యక్షురాలు తలచుకుంటే సమసిపోతుందని.. సోనియాగాంధి 10 జన్‌పాత్‌లో వారిద్దరిని ఒక కప్పు టీ కోసం పిలిచినట్లయితే సంక్షోభం పోతుందని అన్నారు, ఇద్దరిని ముఖాముఖిగా కూర్చునేలా చేసినప్పుడు, రాజస్థాన్ లో సమస్య టీ కప్పులో తుఫానుగా ముగుస్తుంది అని మార్గరెట్ అల్వా అభిప్రాయపడ్డారు.  

Tags:    

Similar News