Ghulam Nabi Azad: ఆజాద్‌ పద్మ భూషణ్‌పై జోరుగా చర్చ

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌ రెబెల్‌ నేత, గులాంనబీ అజాద్‌కు కేంద్రం ప్రకటించిన పద్మ భూషణ్‌పై ప్రసంశంలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2022-01-26 11:23 GMT

Ghulam Nabi Azad: ఆజాద్‌ పద్మ భూషణ్‌పై జోరుగా చర్చ

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌ రెబెల్‌ నేత, గులాంనబీ అజాద్‌కు కేంద్రం ప్రకటించిన పద్మ భూషణ్‌పై ప్రసంశంలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెబల్‌ నేతలు అభినందనలు చెబుతుండగా.. కాంగ్రెస్‌ నేతలు మాత్రం పురస్కారాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశ అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్‌ను గులాంనబీ ఆజాద్‌కు ప్రకటించింది. దీంతో గులాంనబీ ఆజాద్‌కు బీజేపీ, జీ-23 నేతలు అయనకు అభినందనలు తెలిపారు. గులాంనబీ ఆజాద్‌ సేవలు దేశం గుర్తించిందని కాంగ్రెస్ మాత్రం అతడి సేవలను వద్దనుకుందని కపిల్‌ సిబాల్‌ ట్వీట్‌ చేశారు.

జీ-23 గ్రూపునకు చెందిన మరో ఇద్దరు నేతలు రాజ్‌ బబ్బర్, ఆనంద్‌ శర్మతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా ఆజాద్‌కు అభినందనలు తెలిపారు. అయితే రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ మాత్రం విమర్శించారు. ఆయన ఆజాద్‌గానే ఉండాలని గులాంలా ఉండకూడదంటూ జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేశారు. బెంగాల్‌ మాజీ సీఎం బుద్దదేవ్‌ భట్టాచార్య నిర్ణయాన్ని జైరాం రమేష్‌ టాగ్‌ చేశారు.

ఇతర కాంగ్రెస్‌ నేతల నుంచి, గాంధీల కుటుంబం నుంచి గులాంనబీ ఆజాద్‌కు ఎలాంటి అభినందనలు రాలేదు. అయితే తాజా వ్యాఖ్యలపై గులాంనబీ ఆజాద్ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

Tags:    

Similar News