భారత్ బంద్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్

Bharath Bandh: పలు రాష్ట్రాల్లో హై అలర్ట్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు దగ్గర భద్రత కట్టుదిట్టం

Update: 2022-06-20 04:29 GMT

భారత్ బంద్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్

Bharath Bandh: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అల్లర్లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని RPF యూనిట్లకు ఆదేశించారు.

బిహార్‌లో ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే, హింసకు పాల్పడే వారిని అరెస్ట్‌ చేసేందుకు భారీగా పోలీసులను మోహరించాలని కేరళ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అటు అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్.. జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క‍్రమంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర‍్ణయం తీసుకుంది. ఇవాళ జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు ప్రకటించారు. 

Tags:    

Similar News