'నేను ప్రేమ పెళ్లి చేసుకోను' : భీష్మ ప్రతిజ్ఞ

Update: 2020-02-17 06:06 GMT

ఫ్రిబ్రవరి 14 ప్రేమికులకు పండగ రోజు.. ఆరోజు కోసం సంవత్సరం తరబడి ఎదురుచూస్తుంటారు ప్రేమికులు. అయితే కొందరు విద్యార్థినులు మాత్రం ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు 'నేను ప్రేమ పెళ్లి చేసుకోను' అనే ప్రతిజ్ఞ కూడా చేశారు.. మహారాష్ట్ర, అమరావతి ప్రాంతంలోని 'మహిళా కళ వనిజ మహా విద్యాలయ' అనే కళాశాలలో శుక్రవారం ఉదయం ఈ ప్రతిజ్ఞ జరిగింది. రోజు.. 'నేను నా దేశమును ప్రేమించుచున్నాను..' అని రోజూ ప్రతిజ్ఞ చేయించే ఆ కాలేజీ యాజమాన్యం.. ప్రేమికుల రోజు బిన్నంగా వ్యవహరించారు..

'బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం నేను పాటు పడతాను..' అని చెప్పిస్తూ.. పనిలో పనిగా ఆరోజు 'నేను ప్రేమ పెళ్లి చేసుకోను' అనే మాటను కూడా అనిపించేశారు! అక్కడితో ఆగకుండా.. 'నా తల్లిదండ్రులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి నేను ప్రేమించను, ప్రేమ పెళ్లి చేసుకోను' అని ప్రతిజ్ఞ చేయించారు. అయితే ఇందుకు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బలవంతపు పెళ్లి చెయ్యడం ఎంత తప్పో.. ప్రేమ పెళ్లి చేసుకోను అని చెప్పించడం కూడా అంతే తప్పు అని కొంతమంది నెటిజన్లు మండిపడుతుంటే.. మరికొందరు మాత్రం ఈ భీష్మ ప్రతిజ్ఞను స్వాగతిస్తున్నారు. 

Tags:    

Similar News