MK Stalin: ఈ ఘటన మళ్లీ ఎన్నడూ జరగకూడని విషాదం

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2025-09-29 11:47 GMT

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మళ్లీ జరగకూడని విషాదమన్నారు. ఆస్పత్రిలోని దృశ్యాలు ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉన్నాయని చెప్పారు. విషయం తెలియగానే జిల్లా యాత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పిల్లలు, మహిళలు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించి.. పంపిణీ చేశామన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోందని చెప్పారు. ఘటనపై జస్టిస్ అరుణ జగతీసన్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News