నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, టి.కాంగ్రెస్ ఇంఛార్జీ మున్షీ
Delhi: పార్లమెంటు ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీపై.. ఖర్గే, రాహుల్‌తో చర్చించనున్న రేవంత్‌రెడ్డి, మున్షీ
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, టి.కాంగ్రెస్ ఇంఛార్జీ మున్షీ
Delhi: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, టీ కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్టానం నుండి పిలుపొచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్దిశానిర్దేశం చేయనుంది. లోక్‌సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్పదవుల భర్తీపైనా అధిష్ఠానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.