గాల్వన్ లోయ తమ సొంతమని ప్రకటించుకున్న చైనా

గాల్వన్ లోయను చైనా తన సొంతమని ప్రకటించుకుంది. గాల్వన్ వ్యాలీ చైనాలో భాగమని, ఎల్‌ఎస్‌సి తమ వైపు ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జౌ లిజియన్

Update: 2020-06-20 05:47 GMT

గాల్వన్ లోయను చైనా తన సొంతమని ప్రకటించుకుంది. గాల్వన్ వ్యాలీ చైనాలో భాగమని, ఎల్‌ఎస్‌సి తమ వైపు ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జౌ లిజియన్ శుక్రవారం రాత్రి అన్నారు. భారత సైనికులు ఇక్కడ బలవంతంగా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. జూన్ 15 సాయంత్రం భారత దళాలు ఉద్దేశపూర్వకంగా ఎల్‌ఐసిని దాటి చైనా దళాలపై దాడి చేసి, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇలా నాలుగు రోజుల్లో ఐదవసారి చైనా అధికారులు వ్యాఖ్యానించారు. అంతేకాదు జూన్ 15 న జరిగిన సంఘటనకు భారత్‌దే కారణమని జావో లిజియన్‌ అన్నారు. గాల్వన్ లోయ వాస్తవ నియంత్రణ రేఖ యొక్క చైనా భాగంలోకి వస్తుంది అని అన్నారు. ఇక్కడ చైనా సెక్యూరిటీ గార్డులు చాలా సంవత్సరాలుగా పెట్రోలింగ్ , తమ విధులను నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.

కాగా గాల్వన్ సరిహద్దులో చైనా సైనికులు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికుల అమరులైన సంగతి తెలిసిందే. చైనా సైనికుల దాడిపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయంలో ఏమి చెయ్యాలన్న దానిపై శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. చైనా సైనికులను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. గాల్వన్ లో ఒక అంగుళం నేల కూడా చైనాకు పోనివ్వమని అన్నారు.


Tags:    

Similar News