Chhattisgarh: దురుసుగా ప్రవర్తించిన సూరజ్ జిల్లా కలెక్టర్‌పై వేటు

Chhattisgarh: యువకుడిపై దురుసుగా ప్రవర్తించిన ఛత్తీస్‌ఘడ్‌ లోని సూరజ్ జిల్లా కలెక్టర్‌పై వేటు పడింది.

Update: 2021-05-23 10:26 GMT

యూవకుని చెంపపై కొట్టిన కలెక్టర్ (ఫైల్ ఇమేజ్)

Chhattisgarh: యువకుడిపై దురుసుగా ప్రవర్తించిన ఛత్తీస్‌ఘడ్‌ లోని సూరజ్ జిల్లా కలెక్టర్‌పై వేటు పడింది. సూరజ్‌లో లాక్‌‌డౌన్ విధుల్లో ఉన్న కలెక్టర్ రణ్‌బీర్ శర్మ మందులు కొనేందుకు వెళ్లిన ఓ యువకుడి చెంప చెల్లుమనిపించాడు. అతని మొబైల్‌ను నేలకేసి పగలకొట్టాడు. ఈ వీడియో ట్టిట్టర్‌ను ఊపేసింది. నెటిజన్లంతా కలెక్టర్ రణ్‌బీర్ శర్మపై వేటు వేయాలంటూ ట్వీట్లు చేశారు. సస్పెండ్ రణ్‌బీర్ శర్మ ఐఏఎస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు భారీగా పెరగడంతో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం భూపేశ్ భాగల్ కలెక్టర్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. 

Tags:    

Similar News