చెన్నైలో లాంగ్ మార్చ్.. CAA , NRC కి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్

Update: 2020-02-19 06:57 GMT

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ని వ్యతిరేకిస్తూ.. బుధవారం చెన్నైలోని వాలాజ రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు జనం. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా శాసన సభ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీని ముట్టడి చేయాలని నిర్ణయించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని భారీ పోలీసు బలగాలను మోహరించారు.

భారీ పోలీసు బందోబస్తు మధ్య చెన్నైలో సిఎఎ వ్యతిరేక కవాతు జరిగింది. తమిళనాడు సచివాలయం ఉన్న చెపాక్‌లో నిరసనకారులు తాత్కాలిక వేదికను ఏర్పాటు చేశారు. చేపాక్ నుండి సచివాలయం వైపు రహదారి బారికేడ్లను ఉపయోగించి పోలీసులు వారిని చుట్టుముట్టారు. నిరసనకారులు కలైవనార్ అరంగం స్టేడియం నుండి చేపాక్ వరకు 200 మీటర్ల మార్చ్ చేపట్టారు.

మరోవైపు మంగళవారం, న్యాయమూర్తులు ఎం. సత్యనారాయ, ఆర్ హేమలతలతో కూడిన ధర్మాసనం మార్చి 11 వరకు మధ్యంతర నిషేధాన్ని మంజూరు చేసింది, తమిళనాడు ఇస్లామిక్ మరియు రాజకీయ సంస్థల సమాఖ్య మరియు దాని అనుబంధ సంఘాలు ఆందోళనను నిర్వహించకుండా నిషేధించాయి. పౌరసత్వ సవరణ చట్టం , పౌరుల జాతీయ రిజిస్టర్, జాతీయ జనాభా నమోదుపై ఎటువంటి అభిప్రాయాన్ని సేకరించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

అయినా బిజెపియేతర పాలించిన రాష్ట్రాలు చేసినట్లుగా సిఎఎను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించాలని ఎఐఎడిఎంకె ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమం తలపెట్టారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో సిఎఎ వ్యతిరేక తీర్మానాన్ని మూవ్ చేయాలని ప్రతిపక్ష డిఎంకె చేసిన ప్రయత్నం విఫలమైంది, స్పీకర్ పి ధనపాల్ దీనికి నోటీసు ఇవ్వకపోవడంతో ఇది సాధ్యం కాలేదు.

ఫిబ్రవరి 13 నుండి 15 రోజుల పాటు నగరంలో ఎలాంటి ఆందోళన లేదా ప్రదర్శనలకు అనుమతి లేదని మద్రాస్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 41 కింద నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. CAA మరియు ఇతర చర్యలను వ్యతిరేకిస్తున్న వివిధ సంస్థలు, ఉత్తర చెన్నై ప్రాంతమైన వాషర్‌మన్‌పేట్‌లో ఒక నెలకు పైగా నిరంతర ఆందోళనలను చేస్తూ వస్తోంది. ఫిబ్రవరి 14 నుండి ఉత్తర చెన్నైలోని ఓల్డ్ వాషర్‌మన్‌పేట్ వద్ద నిరంతర నిరసన కొనసాగుతోంది.. దీనిని సోషల్ మీడియాలో "చెన్నై యొక్క షాహీన్ బాగ్" గా నిరసనకారులు అభివర్ణించారు.

Tags:    

Similar News