Cheetah And Dog
ఓ చిరుత పులి కుక్కను వేటాడబోయింది.. తరుముకుంటూ వచ్చేసరికి ఆ జాగిలం ప్రాణభయంతో ఓ మరుగుదొడ్డిలో దూరింది. చిరుత కూడా అందులో ప్రవేశించింది. ఇంతలో ఆ ఇంటి యజమాని మరుగుదొడ్డికి బయట తాళం వేసేసరికి రెండూ అందులో బందీ అయ్యాయి. బయటకు పోయే దారి లేక చిరుత అయోమయంతో కుక్కను వేటడటం మరిచి మూలన నక్కింది. కుక్క తనకు అందుబాటులోనే ఉన్నా దాన్నేమీ చేయలేదు. దాదాపు రెండు గంటలసేపు అవి మరుగుదొడ్డిలోనే ఉండిపోయాయి. ఈ ఘటన కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్ర సమీపంలోని కైకంబ అనే గ్రామం వద్ద చోటుచేసుకుంది.