ఇకపై మరింత ఈజీగా ఓటరు నమోదు ప్రక్రియ.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. అదేంటంటే?
Electoral Rolls: ఓటరు id కార్డ్ అనేది దేశంలోని వయోజన పౌరుడిగా మన గుర్తింపును నిర్థారించే ఒక ఐడెంటిటీ..ఇది కేవలం ఓటు వేయడానికి మాత్రమే కాదు మన పౌరసత్వానికి సైతం రుజువుగా పని చేస్తుంది.
ఇకపై మరింత ఈజీగా ఓటరు నమోదు ప్రక్రియ.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. అదేంటంటే?
Electoral Rolls: ఓటరు id కార్డ్ అనేది దేశంలోని వయోజన పౌరుడిగా మన గుర్తింపును నిర్థారించే ఒక ఐడెంటిటీ..ఇది కేవలం ఓటు వేయడానికి మాత్రమే కాదు మన పౌరసత్వానికి సైతం రుజువుగా పని చేస్తుంది. మన దేశంలో ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకొని ఓటరు కార్డు పొందాలంటే 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాలి. అయితే భారత ఎన్నికల సంఘం 17 ఏళ్లు పైబడినవారందరికీ ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ గత ఏడాది నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓటరు నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా, జనన, మరణాల నమోదు ఆధారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేసేందుకు నాంది పలికింది.
కొత్త విధానం
దేశంలో జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. నూతన చట్టం ప్రకారం జననాల జాబితాలో నమోదు అయినవారికి 18 ఏళ్లు నిండగానే..నేరుగా ఎన్నికల సంఘం నుంచి సందేశం వస్తుంది. ఓటు నమోదు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. అలా దరఖాస్తు చేసుకున్న వెంటనే సదరు వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో ఆటోమేటిక్ గా చేరిపోతుంది.
డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ సులభతరం:
ఇక అదే విధంగా ఎవరైనా చనిపోతే మరణాల జాబితా ద్వారా సదరు సమాచారం ఎన్నికల సంఘానికి చేరుతుంది. దాని ఆధారంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి 15 రోజుల్లో ఎన్నికల జాబితా నుంచి పేరు తొలిగిపోతుంది. ఇందుకు సంబంధించి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ కొత్త చట్టం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ జారీ కూడా సులభతరం అవుతుందని కేంద్ర మంత్రి అన్నారు. ఇక దేశంలో జనాభా లెక్కల కోసం జియో ఫెన్సింగ్ అప్లికేషన్ ను రూపొందించామని తెలిపారు. మొత్తంగా జనన,మరణ నమోదును ఎన్నికల జాబితాకు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది కార్యరూపం దాల్చితే..దొంగఓట్లకు చెల్లుచీటితో పాటు ఓటరు నమోదు ప్రక్రియ సైతం సులభతరం అవుతుంది.