Free Food Grains: పేదలకు తీపి కబురందించిన కేంద్ర ప్రభుత్వం

Free Food Grains: కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ తో దేశంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Update: 2021-05-05 15:55 GMT

పేదలకు ఉచితంగా 5 కేజీల ఆహార ధాన్యాలు

Free Food Grains: కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ తో దేశంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో పలు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. దీనివల్ల పేదలు, రోజువారీ కూలీలకు చాలా ఇబ్బందలు ఎదురవుతున్నాయి. అలాగే చాలాప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు.

దీంతో కేంద్రం ప్రభుత్వం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు సిద్ధమైంది. ఈమేకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నెల నుంచే పేదలకు 5 కిలోల చొప్పున ఉచితంగా ఆహార ధాన్యాలను అందించేందుకు సమాయత్తమైంది. మే, జూన్‌ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద అందించేందుకు ఆమోదం తెలిపింది. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 79.88 కోట్ల మందికి అందిస్తామని కేంద్రం పేర్కొంది.

Tags:    

Similar News