Delhi: ఢిల్లీకి ఆక్సిజన్‌ సరఫరాపై కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

Delhi: దేశ రాజధాని ఢిల్లీకి ఆక్సిజన్‌ విషయంలో కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Update: 2021-05-08 05:03 GMT

Delhi: ఢిల్లీకి ఆక్సిజన్‌ సరఫరాపై కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

Delhi: దేశ రాజధాని ఢిల్లీకి ఆక్సిజన్‌ విషయంలో కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీ రాష్ట్రానికి రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సమీక్షించే వరకు లేదా సవరించే వరకు కచ్చితంగా అమలు చేయవలసిందేనని తేల్చి చెప్పింది దర్మాసనం. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై స్పందించిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం మీద మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్‌ను సరఫరా చేయడం లేదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పైనే సుప్రీం కోర్టు విచారణ జరిపి కేంద్రాన్ని మందలించింది.

Tags:    

Similar News