పేదల కోసం కేంద్రం మరో నిర్ణయం.. కోట్లాది మందికి వెంటనే ప్రయోజనం..!

Joint Registration: పేద ప్రజలకు తక్కువ ధరకు లేదా ఉచితంగా రేషన్ అందించడానికి ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేస్తుంది.

Update: 2022-08-10 11:30 GMT

పేదల కోసం కేంద్రం మరో నిర్ణయం.. కోట్లాది మందికి వెంటనే ప్రయోజనం..!

Joint Registration: పేద ప్రజలకు తక్కువ ధరకు లేదా ఉచితంగా రేషన్ అందించడానికి ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేస్తుంది. వీటివల్ల నిరుపేదలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వారి రాష్ట్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు జారీ చేస్తుంది. అదే సమయంలో రేషన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని వల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రేషన్ కార్డులను జారీ చేయడానికి ఉమ్మడి రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది.

నిరాశ్రయులైన వ్యక్తులు, నిరుపేదలు, వలసదారులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేలా చేయడం ఈ రిజిస్ట్రేషన్ ఉద్దేశ్యం. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA)సుమారు 81.35 కోట్ల మందికి గరిష్ట కవరేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఈ చట్టం కింద దాదాపు 79.77 కోట్ల మందికి సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. దీని ప్రకారం మరో 1.58 కోట్ల మంది లబ్ధిదారులు చేరే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అర్హులైన లబ్ధిదారులను త్వరగా గుర్తించడమే 'కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ' (నా రేషన్-నా హక్కు) లక్ష్యం అని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. అటువంటి వ్యక్తులకు తొందరగా గుర్తించి రేషన్ కార్డులు జారీ చేసి వారికి NFSA కింద గుర్తింపుని అందిస్తారు. గత ఏడెనిమిదేళ్లలో వివిధ కారణాల వల్ల దాదాపు 18 నుంచి 19 కోట్ల మంది లబ్ధిదారులకు చెందిన 4.7 కోట్ల రేషన్‌కార్డులు రద్దు అయ్యాయి.

Tags:    

Similar News