Pradhan Mantri Kisan Samman Nidhi: రేపట్నుంచి అన్నదాతలకు కేంద్రం నిధులు.. బ్యాంకు ఖాతాలో రూ. 2వేలు జమ

Pradhan Mantri Kisan Samman Nidhi: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హులైన రైతులందరికీ కేంద్రం రేపు అంటే అగష్టు 1న తమ తమ బ్యాంకు ఖాతాల్లో రూ. 2వేలను జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

Update: 2020-07-31 02:45 GMT
Pradhan Mantri Kisan Samman Nidhi

Pradhan Mantri Kisan Samman Nidhi: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హులైన రైతులందరికీ కేంద్రం రేపు అంటే అగష్టు 1న తమ తమ బ్యాంకు ఖాతాల్లో రూ. 2వేలను జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నిధులు జమ అవుతున్నవారు మినహా అర్హులెవరైనా ఉంటే సంబంధిత అధికారులను కలిసి లబ్ధిదారుల జాబితాలో చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మరోసారి తీపికబురు అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా అందిస్తున్న డబ్బులను మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. ఆగస్ట్ నెల 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. మోదీ సర్కార్ రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా వారికి ఏడాదికి రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే.

మూడు విడతల రూపంలో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులు వచ్చి చేరతాయి. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరో విడత డబ్బులను ఆగస్టు 1 నుంచి లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలో కేంద్రం జమచేయనుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో..లేదో తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

గడిచిన 18 నెలల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) పథకం కింద 10 కోట్ల 9 లక్షల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు జమ చేసి మోదీ ప్రభుత్వం ఓ కొత్త రికార్డు సాధించింది. అయితే ఈ పథకం కింద మరో 4 కోట్ల 40 లక్షల మందికి సహాయం అందించాల్సి ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం సేకరించారు. కాగా ఇప్పటికీ ప్రయోజనం పొందని రైతులు, వారి బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ కార్డులో ఏదైనా పొరపాటు జరగడం లేదా బ్యాంకు అకౌంట్ తో ఆధార్ కార్డు లింక్ లేకపోవడం లాంటి సమస్యలు ఉంటే మాత్రం వెంటనే తమకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్లను అందుబాటులోకి తెచ్చింది.

కరోనా వైరస్ ను ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో, పిఎం కిసాన్ కింద అందుకున్న 2000 రూపాయల వాయిదాలను ఈ పథకం యొక్క అర్హత కలిగిన రైతులకు పంపుతామని ప్రభుత్వం మార్చి 27 న హామీ ఇచ్చింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఒక వేళ మీకు డబ్బు అందకపోతే మీకు 2000 రూపాయలు ఎందుకు రాలేదని కూడా తనిఖీ చేయాలి. PM కిసాన్ సైట్‌లో మీరే స్వయంగా స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఏటా 6 వేల రూపాయలను మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

ఈ పథకం ద్వారా దేశంలోని మొత్తం 14.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ చాలా మందికి రిజిస్ట్రేషన్ పరంగా పలు సమస్యలు ఎదురయ్యాయి. అంతేకాదు రెవెన్యూ రికార్డులో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం ద్వారా లబ్ది పొందారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో లోపాలతో పాటు ఆధార్, బ్యాంకు అకౌంట్ల లింక్ లో లోపాల వల్ల మరికొంత మందికి ఈ పథకం అందలేదు. వీటిని వీలైనంత తొందర్లో పరిష్కారం చేసుకుంటే పథకానికి సంబంధించిన నిధులను జమచేయనున్నట్టు కేంద్రం తెలిపింది.    

Tags:    

Similar News