Sunita Williams: క్షేమంగా తిరిగి వచ్చిన సునీతా.. ఆమె పూర్వీకుల గ్రామంలో సంబురాలు

Update: 2025-03-19 01:05 GMT

Sunita Williams: 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిని చేరుకోవడంతో భారత్ లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబురాలు మిన్నంటాయి. గుజరాత్ లోని ఝూలాసన్లో ఆమె బంధువులు, గ్రామస్థులు సంబురాలు చేసుకున్నారు. టపాసులు, బాణసంచా కాల్చుతూ డ్యాన్స్ లు చేశారు. అంతకుముందు ఆమె సురక్షితంగా భూమిని చేరుకోవాలని గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి యజ్నం చేశారు.

భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగురు సంతానంలో సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్య గుజరాత్ లో జన్మించారు. మసాచుసెట్స్ లో 1983లో హైస్కూల్, 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి బీఎస్సీ 1995లో ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో సునీత ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 1997లో మిలటరీలో చేరిన సునీత..30రకాల విమానాలను 3వేల గంటలు నడిపిన అనుభవాన్ని పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా సెలక్ట్ అయ్యారు. 

Tags:    

Similar News