CBSE: విద్యార్థులు అలర్ట్.. 10, 12 తరగతుల టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

CBSE: సీబీఎస్‌ఈ పది, పన్నెడు తరగతులు విద్యార్థులకు గమనిక.

Update: 2022-03-12 10:14 GMT

CBSE: విద్యార్థులు అలర్ట్.. 10, 12 తరగతుల టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

CBSE: సీబీఎస్‌ఈ పది, పన్నెడు తరగతులు విద్యార్థులకు గమనిక. బోర్డు టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 26 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షలన్నీ ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతాయని బోర్డ్‌ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే టర్మ్‌-1 పరీక్షలను నిర్వహించిన బోర్డు తాజాగా టర్మ్‌2 పరీక్షలను కూడా పూర్తి చేయనుంది. కరోనా (Corona) మహమ్మారి కారణంగా పరీక్షల నిర్వహణలో జాప్యం కావడంతో సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఈ సారి రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండు టర్మ్‌ పరీక్షలకు మధ్య చాలా గ్యాప్‌ ఇచ్చినట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన శాంపిల్‌ ప్రశ్నా పత్రాల్లాగే పరీక్షల ప్రశ్నాపత్రాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించే సమయంలో జేఈఈ మెయిన్‌తో సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకున్నట్లు బోర్డు జారీ చేసిన సర్క్యూలర్‌లో తెలిపింది. సీబీఎస్‌ఈ బోర్డ్‌ పేరుతో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని ఏదైనా సమాచారం వెబ్‌సైట్‌లో ఉంటుందని పేర్కొంది.


Tags:    

Similar News