ఆ ఒక్కడు బతికేనా.. మృత్యువుతో పోరాడుతోన్న కెప్టెన్ వరుణ్ సింగ్
Captain Varun Singh: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయారు.
ఆ ఒక్కడు బతికేనా.. మృత్యువుతో పోరాడుతోన్న కెప్టెన్ వరుణ్ సింగ్
Captain Varun Singh: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయారు. మొత్తం 14 మందిలో కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో మిగిలాడు. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.
వరుణ్ సింగ్ మృత్యువుతో పోరాడుతున్నారు. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఈ ఏడాది స్వాంతంత్ర్య దినోత్సవం రోజున 'శౌర్య చక్ర' పురస్కారం అందుకున్నారు. 2020లో ఏరియల్ ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఎల్‌సీఏ తేజాస్ యుద్ధ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినందునకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది.