Karnataka: మంత్రి వర్గంలో శాఖల కేటాయింపు రచ్చ.. హై కమాండ్ గైడెన్స్ కోసం ఢిల్లీకి బొమ్మై

Karnataka: కర్ణాటకలో కేబినెట్ విస్తరణ సెగలు ఇంకా చల్లారలేదు శాఖల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న నేతలు...

Update: 2021-08-10 12:09 GMT

Karnataka: మంత్రి వర్గంలో శాఖల కేటాయింపు రచ్చ.. హై కమాండ్ గైడెన్స్ కోసం ఢిల్లీకి బొమ్మై

Karnataka: కర్ణాటకలో కేబినెట్ విస్తరణ సెగలు ఇంకా చల్లారలేదు శాఖల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న నేతలు బాహాటంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని సీఎం బసవరాజు బొమ్మై మళ్లీ బీజేపీ హైకమాండ్ తలుపు తడుతున్నారు. మెకెడతు ప్రాజెక్ట్ వివాదంపై కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నానని బొమ్మై పైకి చెబుతున్నా విస్తరణ సెగలను చల్లార్చుకోడానికే ఆయన ఢిల్లీ వెళుతున్నారన్నది సన్నిహిత వర్గాల కథనం.

కొత్త మంత్రులు నాగరాజ్, ఆనంద్ సింగ్ తమ శాఖల కేటాయింపుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వారితో బొమ్మై జరిపిన చర్చలు కూడా ఫలించలేదు బీజేపీని కర్ణాటకలో నిలబెట్టేందుకు తాము రాజీనామా చేసి త్యాగం చేశామంటున్న ఆ నేతలు శాఖల కేటాయింపుపై అవసరమైతే బీజేపీ కేంద్ర పెద్దలతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరూ సంపన్నపరులు, కేంద్ర పెద్దలతో సత్సంబంధాలుండటంతో వారిని అదుపు చేయడం బొమ్మై వల్ల కావడం లేదు.

ఇక మరో నేత బి. శ్రీరాములు కూడా తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తిగానే ఉన్నారు. ఇక మరోవైపు కేబినెట్ లో తమ వర్గానికి గుర్తింపు లేదన్నది సీనియర్ నేత అపాచు రంజన్ వాదన వీటన్నింటికన్నా హైలెట్ మాజీ మంత్రి యోగేశ్వర్ ఇప్పటికే ఢిల్లీ వెల్లి కేబినెట్ బెర్త్ కోసం పైరవీలు చేస్తున్నారు.

Tags:    

Similar News