Karnataka: కర్ణాటకాలో పోలీసులపై తిరగబడ్డ ప్రజలు
Karnataka: పోలీసులపై తిరగబడ్డ ప్రజలు * హీనాకల్ రింగ్‌రోడ్డులో వాహన తనిఖీలు
Representational Image
Karnataka: పోలీసులపై ప్రజలు తిరగబడ్డ ఘటన కర్ణాటక రాష్ట్రం హోసూర్‌లో చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుప్రమాదంలో మృతి చెందడానికి పోలీసులే కారణమంటూ మృతుడి బంధువులు, స్థానికులు పోలీసులపై దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు.
హీనాకల్ రింగ్ రోడ్డులోని ఆర్‌ఎంపీ సర్కిల్ దగ్గర పోలీసులు వాహన తనికీలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులను చూసిన దేవరాజ్ తన బైక్‌ను ఆపకుండా వేగంగా ముందుకెళ్లాడు. అదుపుతప్పి కిందపడిపోయాడు. ఇక అదే సమయంలో అటుగా వస్తున్న టిప్పర్ అతడి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దేవరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చొన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న దేవరాజ్ బంధువులు, గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులపై మూకుమ్మడిగా దాడిచేశారు. అంతటితో ఆగక పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకొని ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికీ వినకపోవడంతో లాఠీలకు పనిచెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.