Taj Mahal: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు కాల్
Taj Mahal: గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు
తాజ్ మహల్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)
Taj Mahal: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ప్రేమసౌధం తాజ్‌మహల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు వెంటనే తాజ్‌మహల్‌ను మూసివేసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్ మహల్‌ను వీక్షించేందుకు వచ్చిన వారిని బయటకు తరలించారు. బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్‌తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.