Bomb Threat: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు

Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో త్వరలో బాంబు పేలుతుందని బెదిరిస్తూ ఒక ఈమెయిల్ రావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Update: 2025-09-12 07:40 GMT

Bomb Threat: : ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు

Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో త్వరలో బాంబు పేలుతుందని బెదిరిస్తూ ఒక ఈమెయిల్ రావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఈమెయిల్ అందిన వెంటనే, కోర్టులో ఉన్న సిబ్బంది, న్యాయవాదులు, ఇతర సందర్శకులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన కోర్టుకు చేరుకున్నాయి. కోర్టు భవనం లోపల, బయట ప్రతి మూలనూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇది కేవలం ఒక ఆకతాయి పనిగా భావిస్తున్నప్పటికీ, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News