Delhi Assembly Elections 2025: బీజేపీ దిల్లీలో గెలవడానికి ఐదు కారణాలు

బీజేపీ 27 ఏళ్ల తర్వాత దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. మరోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకోవాలన్న ఆప్‌నకు దిల్లీ ఓటర్లు మొండిచేయి చూపారు.అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఆందోళనల నేపథ్యంలో ఆప్ పార్టీగా ఏర్పడింది. దిల్లీలో అధికారం కోల్పోవడానికి ఆప్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ప్రధాన కారణంగా మారాయి.

Update: 2025-02-08 08:37 GMT

Delhi Assembly Elections 2025: బీజేపీ దిల్లీలో గెలవడానికి ఐదు కారణాలు

బీజేపీ 27 ఏళ్ల తర్వాత దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. మరోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకోవాలన్న ఆప్‌నకు దిల్లీ ఓటర్లు మొండిచేయి చూపారు.అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఆందోళనల నేపథ్యంలో ఆప్ పార్టీగా ఏర్పడింది. దిల్లీలో అధికారం కోల్పోవడానికి ఆప్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ప్రధాన కారణంగా మారాయి.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం సాగుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే అభివృద్ది సాధ్యమని కూడా మోదీ ఓటర్లకు సూచించారు. ఆప్ సర్కార్ అవినీతిపై బీజేపీ ఫోకస్ చేసింది. ఆప్ నాయకులు దిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన అంశంపై కూడా బీజేపీ ప్రచారానికి ఉపయోగించుకుంది.

బీజేపీ గెలుపునకు ఐదు ముఖ్య కారణాలు


1. మధ్య తరగతిపై బీజేపీ ఫోకస్

మధ్య తరగతి ప్రజల నిరాశలను రాజకీయంగా తనకు అనుకూలంగా ఆప్ మలుచుకొంది. 200 యూనిట్ల వరకు ప్రజలకు ఉచిత కరెంట్, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ఆప్ అమలు చేసింది. సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేసింది.

ఎన్నికల సమయంలో మధ్య తరగతి ప్రజలను ఆకర్షించే దిశగా కేజ్రీవాల్ ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని వరాలు కురిపించింది బీజేపీ. 12 లక్షల వరకు ఆదాయపన్నును ఎత్తివేయడం ఇందులో భాగం.2022లో పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ నివేదిక ప్రకారం ఢిల్లీ జనాభాలో 67.16%గా మధ్యతరగతి జనాభా ఉంది. ఈ ఓటుబ్యాంకును బీజేపీ తన వైపునకు తిప్పుకోగలిగింది.

2. ఆప్ పథకాలు కొనసాగిస్తామని హామీ

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేస్తోంది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పథకాలను కొనసాగిస్తామని కమలం పార్టీ హామీ ఇచ్చింది. ఉచితాలపై గతంలో మోదీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కానీ, దిల్లీలో గెలుపు ముఖ్యమని భావించిన నేపథ్యంలో ఉచితాల విషయంలో బీజేపీ వెనక్కు తగ్గాల్సివచ్చింది. బీజేపీకి ఓటేస్తే ఉచితాలు, సంక్షేమ పథకాలు పోతాయని ఆప్ ప్రచారం చేసింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టేలా మోదీ ప్రచారం చేశారు.

3. రోడ్లు, డ్రైనేజీ కాల్వల దుస్థితి

దేశ రాజధాని దిల్లీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. దీనికి తోడు డ్రైనేజీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ రెండు అంశాలు కూడా ఆప్ ప్రభుత్వంపై వ్యతిరేకతను మరింత పెంచాయి. దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైన్లు, చెత్త సేకరణ సరిగా చేయకపోవడం వంటి అంశాలు ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తికి కారణమయ్యాయి. ఈ విషయాన్ని ఆప్ నాయకులు కూడా ఒప్పుకుంున్నారు. గేటేడ్ కమ్యూనిటీలు, మధ్య తరగతి, సంపన్నులు ఉన్న ప్రాంతాల్లో రోడ్ల అంశం ఆప్ సర్కార్ కు ఇబ్బందిగా మారింది. దిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. ఎంసీడీలో కూడా ఆప్ గెలిచింది. ఇది కూడా పరోక్షంగా బీజేపీ గెలుపునకు కారణమైంది. రోడ్లు సరిగా లేకపోవడం, పరిశుభ్రత లేని కారణంగా

4.లెఫ్టినెంట్ గవర్నర్-ఆప్ మధ్య గొడవ

దిల్లీలో అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కే ఉన్నాయి. అభివృద్ది పనులు జరగాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇవ్వాలి. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దిల్లీలో కూడా అదే పార్టీ అధికారంలో ఉంటే తమ ప్రాంతంలో అభివృద్ది పనులు జరుగుతాయని స్థానికుల్లో భావన ఏర్పడింది. దీనికి తోడు ఆప్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత కూడా కమలం పార్టీకి కలిసి వచ్చింది.

5.ఆప్ ప్రభుత్వంపై వ్యతిరేకత

ఆప్ పార్టీ 2012లో ఏర్పాటైంది. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆ పార్టీ పవర్ కు దూరమైంది. అయితే 2015, 2020 ఎన్నికల్లో ఆ పార్టీ దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ పై ఆరోపణలు వచ్చాయి. దిల్లీ లిక్కర్ స్కాం ఆప్ ను ఓ కుదుపు కుదిపేసింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యులు జైలుకు వెళ్లారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. సీఎంనైనా సామాన్యుడినే అంటూ కేజ్రీవాల్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కేజ్రీవాల్ ఇల్లు అద్దాల మేడ అంటూ కమలం పార్టీ విమర్శలు చేసింది. కేజ్రీవాల్ ఇంటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఎన్నికల సమయంలో ప్రతి వీధిలో ఈ వీడియోతో బీజేపీ ప్రచారం చేసింది.

Tags:    

Similar News