కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరుకానున్న మోడీ, అమిత్ షా, నడ్డా
BJP : మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరుకానున్న మోడీ, అమిత్ షా, నడ్డా
BJP : మణిపూర్ అంశంపై పార్లమెంట్ అట్టుడుకుతున్న వేళలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. మణిపూర్ అంశంపై చర్చ చేపడతామని విపక్షాలను ఒప్పిస్తూనే... పలు కీలక బిల్లుల ఆమోదానికి అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుతో పాటు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.