ఇవాళ, రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

* ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో రెండ్రోజుల పాటు సమావేశాలు

Update: 2023-01-16 03:41 GMT

 ఇవాళ, రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

BJP Meeting: బీజెపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరుగనున్నాయి. N.D.M.C. కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజుల పాటు జరుగనున్న సమావేశాల్లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 350 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పొడిగింపుపై ఈ సమావేశాల్లో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలకు సమాయత్తం అయ్యే అంశంపై చర్చ జరుగనుంది. రాజకీయ, ఆర్ధిక అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేయనుంది. ఈ సమావేశాల్లో మొదటి రోజు ఢిల్లీలో కిలోమీటర్ పొడవున రోడ్ షో జరుగనుంది. ఈ రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొంటారు. రోడ్ షో సందర్భంగా రోడ్డు పొడవునా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

బీజెపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి 28 రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ‎ఆరుగురు డిప్యూటీ సీఎంలు, 35 మంది కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పార్టీ కార్యవర్గం ఎజెండాకు తుది మెరుగులు దిద్దేందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజెపీ పదాధికారుల సమావేశం జరుగనుంది. ఈ పదాధికారుల సమావేశంలో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు. సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి పదవీ కాలాన్ని పొడిగించే ప్రతిపాదనకు చోటు దక్కుతుంది. సమావేశాల ముగింపు రోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News