బీజేపీ ఆపరేషన్ సౌత్.. దక్షిణాదిలో 50 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్

BJP: దక్షిణాదిలో విస్తృతంగా పర్యటిస్తున్న మోదీ

Update: 2024-01-04 08:18 GMT

బీజేపీ ఆపరేషన్ సౌత్.. దక్షిణాదిలో 50 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్  

BJP: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సౌత్ ఇండియాలో 40 నుంచి 50 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్‌ సౌత్‌లో భాగంగానే ప్రధాని మోదీ ఇటీవల తమిళనాడు, కేరళల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ దఫా 350 లోక్‌సభ స్థానాలు గెలవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇది సాధించాలంటే దక్షిణాదిన కూడా ఎక్కువ సీట్లు గెలవాల్సి ఉంటుంది. దక్షిణ భారతంలో 129 లోక్‌సభ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో బీజేపీ 29 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇందులోనూ 25 సీట్లు కర్ణాటకలో వచ్చాయి. తెలంగాణలో 4 స్థానాలు గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళల్లో ఖాతా తెరవలేదు. కర్ణాటకలో నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బలం పెంచుకున్నా.. కనీసం రెండో స్థానమైనా సాధించలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచిచన కాంగ్రె్‌సకు ఈ దఫా లోక్‌సభ సీట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నష్టాన్ని ఆంధ్ర, తమిళనాడు, కేరళల్లో పూడ్చుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ దిశగానే ప్రధాని జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఐదు దక్షిణ రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారని.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. . వయనాడ్‌లో రాహుల్‌గాంధీపై గట్టి అభ్యర్థిని నిలపాలని యోచిస్తోంది.

Tags:    

Similar News