Biporjoy Cyclone: అతి తీవ్ర తుపానుగా 'బిపోర్‌ జాయ్‌'.. ఆ 3 రాష్ట్రాలకు హెచ్చరికలు

Biporjoy Cyclone: రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్‌లో భారీ వర్షాలు

Update: 2023-06-11 04:47 GMT

Biporjoy Cyclone: అతి తీవ్ర తుపానుగా ‘బిపోర్‌ జాయ్‌’.. ఆ 3 రాష్ట్రాలకు హెచ్చరికలు

Biporjoy Cyclone: అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను బిపోర్‌ జాయ్‌ మరో 12 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది 24 గంటల్లో ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. వచ్చే 3 రోజుల్లో ఉత్తర-పశ్చిమ దిశగా తుపాను కదులుతుంది. ప్రస్తుతం అది గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 6వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. పోర్‌బందర్‌కు 2వందల నుంచి 3వందల కిలోమీటర్ల దూరం వెళ్లిపోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. గుజరాత్‌ను తాకకపోవచ్చు. అయితే రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయి. వచ్చే 5 రోజులూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.

తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయి. బలమైన ఈదురు గాలులూ వీస్తాయి. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. తుపాను కారణంగా కచ్‌ ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పోర్‌బందర్‌, గిర్‌, సోమనాథ్‌, వల్సాద్‌లకు జాతీయ విపత్తు దళ బృందాలను అధికారులు పంపారు.

Tags:    

Similar News