Breaking News: త్రిపుర సీఎం రాజీనామా.. అమిత్ షాతో భేటీ తర్వాత..
Biplab Kumar Deb: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Breaking News: త్రిపుర సీఎం రాజీనామా.. అమిత్ షాతో భేటీ తర్వాత..
Biplab Kumar Deb: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామాను త్రిపుర గవర్నర్ ఎస్.ఎన్. ఆర్యకు సమర్పించారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్‌కుమార్ దేవ్ రాజీనామా చేశారు. కాగా, బిప్లవ్‌కుమార్ శుక‍్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత రోజే నేడు(శనివారం) రాజీనామా చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రమే కొత్త సీఎంను అధిష్టానం నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాదే త్రిపురలో అసెంబ్లీ జరుగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇలా సీఎం మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.