HPV9 Vaccine: HPV 9 క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ.. చైనా రెక్ బయోతో బీఈ ఒప్పందం
HPV9 Vaccine: ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్...హ్యూమన్ పాపిలోమా వైరస్.
HPV9 Vaccine: HPV 9 క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ.. చైనా రెక్ బయోతో బీఈ ఒప్పందం
HPV9 Vaccine: ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్...హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు హైదరాబాద్ సెంటర్‌గా ఉన్న బయోలాజిక్–ఈ(బీఈ) చైనా బయోఫార్మాస్యూటికల్ కంపెనీ రెక్ బయో టెక్నాలజీతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ హెచ్‌పివి క్యాన్సర్. ఇది లైంగికంగా సంక్రమించే వైరస్. ఈ వైరస్ కారణంగా గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ వైరస్ సాధారణమైనదే. ఇది చర్మం అలాగే శ్లేష్మ పొరలలో వస్తుంది. ఈ వైరస్‌లో 100 కంటే ఎక్కువ రకాల హెచ్ పీవీ వైరస్‌లు ఉన్నాయి. ఇది 9 రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ మహిళలందరినీ భయపెడుతోంది. తీవ్రమైన వ్యాధిగా దీన్ని పరిగణిస్తున్నారు. అందుకే ఇటీవల దీనికి సంబంధించి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా హెచ్ పీవీ 9 వ్యాక్సిన్ తయారీ కోసం చైనా బయోఫార్మాస్యూటికల్ కంపెనీ రెక్ బయో టెక్నాలజీతో హైదరాబాద్ సెంటర్ అయిన బయోలాజిక్ –ఈ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన వివరాలను జియాంగ్సు రెక్ బయో టెక్నాలజీ కంపెనీ వెల్లడించింది.
ఈ ఒప్పందం ప్రకారం బీఈకీ జియాంగ్సు రెక్ బయో రీ కాంబినెంట్ 9 వాలెంట్ హెపీవీ 9 వ్యాక్సిన్ టెక్నాలజీ ట్రాన్స్ పర్‌ని ఇప్పటికే ప్రారంభించారు. అదేవిధంగా ఈ వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడి పదార్ధాలను కూడా రెక్ బయో అందిస్తుంది. ఈ టెక్నాలజీ ట్రాన్స్ పర్ పూర్తికాగానే బీఈ వ్యాక్సిన్‌ను తయారు చేయడం మొదలుపెడుతుంది.
హైదరాబాద్ సెంటర్‌గా ఉన్న బీఈ ఈ వ్యాక్సిన్‌ని పూర్తి చేస్తే ప్రపంచవ్యాప్తంగా హెపివీకి వ్యాక్సిన్ అందించే దేశంగా భారత్ మిగులుతుంది. ఈ వ్యాక్సిన్ బీఈలో తయారైన తర్వాత దేశ మార్కెట్‌లోకి వస్తుంది. ఆ తర్వాత యునిసెఫ్, పీఏహెచ్ఓ టెండర్లలో పాల్గొనే అవకాశం బీఈకి ఈ ఒప్పందం ద్వారా దక్కుతుంది.
గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి 9 రకాల క్యాన్సర్లను కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్‌ను నాశనం చేయడానికే ఇప్పుడు హెచ్ పీవీ9 వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నారు. జెనిటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి తయారుచేసే వ్యాక్సిన్ ఇది. ఇదే కాదు, 9–45 ఏళ్ల మధ్యలో ఉన్నవారు వేసే మరో కీలక ఆర్‌ఈసీ 603 వ్యాక్సిన్ ప్రస్తుతం చైనాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయిల్స్ పూర్తయిన తర్వాత ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి రానుంది.