ప్రధాన సమాచార కమిషనర్‌గా బిమల్‌

ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ)గా సమాచార కమిషనర్‌ (ఐసీ)గా ఉన్న బిమల్‌ జుల్కా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Update: 2020-03-07 02:16 GMT

 ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ)గా సమాచార కమిషనర్‌ (ఐసీ)గా ఉన్న బిమల్‌ జుల్కా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమమని జుల్కా కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. ప్రధాన సమాచార కమిషనర్‌ అయిన తాను పారదర్శకకంగా పనిచేస్తానని ప్రమాణం చేశారు.

కాగా ఇంతకుముందే సమాచార కమిషనర్ బిమల్ జుల్కాను శుక్రవారం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సిఐసి) గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ కమ్యూనికేషన్ తెలిపింది. సీఐసీ గా ఉన్న సుధీర్ భార్గవ జనవరి 11 న పదవీ విరమణ చేసిన తరువాత చీఫ్ లేకుండా పనిచేస్తోంది సమాచార శాఖ. అయితే సీఐసీ కాకుండా 10 మంది కమిషనర్లు ఉండాల్సిన కేంద్ర సమాచార కమిషన్‌లో కేవలం 6 మందే కమిషనర్లు ఉన్నారు. ప్రస్తుతం అమిత పండోవే నియామకం తర్వాత మరో 4 సమాచార కమిషన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

Tags:    

Similar News