Bihar Assembly Election: మరో హిట్ కొట్టిన మోడీ, నితీశ్ జోడి.. వెలుగులు పంచని లాంథర్
Bihar Assembly Election: బిహార్‌లో బాణం దూసుకుపోయింది... దీపం ఆరిపోయింది. డబుల్ ఇంజిన్ సర్కార్‌నే ఓటర్లు కోరుకున్నారా...? బీహార్ ప్రజలు నమో మోడీ అనడానికి కారణమేంటి..? ప్రకటించిన తాయిళాలు పని చేశాయా...? మహిళా ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారా....?
బిహార్‌లో మరోసారి కమలం వికసించింది. ఎన్డీఏ హవా కొనసాగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. మోడీ, నితీష్ కాంబినేషన్ మరో హిట్ కొట్టింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. బీహార్‌లో ప్రధాని మోడీ అస్త్రం ఫలించింది. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎన్నికల్లో ప్రచారం చేసిన మోడీ... నితీశ్ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది.
కౌంటింగ్ తొలి దశ నుంచి మెజారిటీ స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్లారు. మహా గఠ్ బంధన్ ఎన్డీఏ దూకుడును ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది. మహాగఠ్ బంధన్ ఇచ్చిన ఎన్నికల తాయిలాలు ఓటర్లను పెద్దగా ఆటకట్టుకోలేకపోయాయి. ఐదుశాతం పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన ప్రతి అధికార మార్పిడి జరగడం బీహఆర్ లో సంప్రదాయం అని నమ్ముతారు. ఈ సెంటింమెట్‌ను కూడా ఈసారి బ్రేక్ చేసి ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఓటర్లు డబుల్ ఇంజన్ సర్కార్ వైపే మొగ్గు చూపారు.
మహా గఠ్ బంధన్ ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ, పార్టీల మధ్య సీట్ల పంపకం.. సీఎం అభ్యర్థి ఎంపిక... అసమ్మతి పోరు ఇవన్నీ ఎన్డీఏకు అడ్వంటేజ్‌గా మారాయి. మొదటి నుంచి ఎన్డీఏ సీఎం అభ్యర్థిపై క్లారిటీగా ఉంది. ఎన్నికల నోటిఫికేసన్ వెలువడినప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోవడం , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అటు మోడీ, ఇటు నితీష్ సక్సెస్ అయ్యారు.
ఎన్డీఏ కూటమి ప్రకటించిన కోటి వరాల సంకల్ప పత్రం ఎన్నికల్లో బాగా పని చేసింది. కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ యువతను ఆకట్టుకుంది. మహిళా సాధికారత కోసం కోటి మంది మహిళలకు లఖ్‌పతి దీదీలుగా తీర్చుదిద్దుతామన్న హామీ మహిళా ఓటర్లపై ప్రభావం చూపింది. ఉచిత రేషన్, పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం, పేదలకు ఇళ్లు వంటి పథకాల ప్రకటన ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా చేశాయి. ఎన్నికలకు ముందు 10వేల రూపాయలను మహిళల అకౌంట్లలో వేయడం కలిసి వచ్చింది.
ఎన్డీఏ కూటమిలో చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఎన్డీఏకు బలమైన సహకార పార్టీలలో ఒకటిగా నిలిచింది. మోడీ, అమిత్ షా, నడ్డా ప్రచారాలు రోడ్ షోలు ఎన్డీఏకు కలిసి వచ్చాయి.
పాలన ఎలా ఉండకూడదో లాలు నేతృత్వంలోని జంగిల్ రాజ్యాన్ని రిఫరెన్స్‌గా చూపించాలని మోడీ చేసిన ప్రచారం ఓటర్లను ఆకర్షించిందనడంలో సందేహం లేదు.