Army Aircraft: కుప్పకూలిన సైనిక విమానం
Army Aircraft: బిహార్‌లో భారత సైన్యానికి చెందిన శిక్షణ విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది.
Army Aircraft: కుప్పకూలిన సైనిక విమానం
Army Aircraft: బిహార్‌లో భారత సైన్యానికి చెందిన శిక్షణ విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు ట్రైనీ పైలెట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. గయలోని సైనిక శిక్షణ అకాడమీ నుంచి బయల్దేరిన యుద్ధ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలినట్లు తెలిపారు.
పైలట్లు శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ప్రమాదం జరిగినట్లు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. విమానం కిందకు పడిపోతుండగానే అందులో ఉన్న ఇద్దరు ట్రైనీ పైలట్లు పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో విమానం ఒక్కసారిగా కూలింది. పంట పొలాల్లో విమానం కూలిపోవడంతో దాన్ని గమనించిన స్థానికులు విమానంలో చిక్కుకున్న ఇద్దరు పైలట్లను రక్షించారు.