కర్ణాటకలో రెండో రోజు జోడో యాత్ర.. వర్షం కారణంగా రెండో రోజు యాత్ర ఆలస్యం

*మైసూరు జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర *మొత్తం 23 కి.మీ. మేర రాహుల్‌ పాదయాత్ర

Update: 2022-10-01 15:30 GMT

కర్ణాటకలో రెండో రోజు జోడో యాత్ర.. వర్షం కారణంగా రెండో రోజు యాత్ర ఆలస్యం

Bharat Jodo Yatra: కర్ణాటకలో భారత్‌ జోడో యాత్ర రెండో రోజుకు చేరింది. రెండో రోజు వర్షం కారణంగా.. రాహుల్‌ గాంధీ పాదయాత్ర 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. చామరాజనగర్‌ జిల్లాలోని తొండివాడి గేట్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. మధ్యాహ్నాం గుండ్లుపేటలోని కలలీ గేట్‌ వద్ద ఆగింది. ఆ తరువాత.. మళ్లీ 4 గంటల 30 నిమిసాలకు ప్రారంభమైన యాత్ర.. మైసూరు జిల్లాలోకి ప్రవేశించింది. తాండవపురం వద్ద ఆగిపోయింది. రెండో రోజు మాత్రం 23 కిలోమీటర్ల మేర రాహుల్‌ గాంధీ పాదయాత్ర నిర్వహించారు.

ఈ యాత్రలో రాహుల్‌ వెంట మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యాతింద్ర సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, హెచ్‌సీ మహదేవప్ప, ఎంబీ పాటిల్‌, కేజీ జార్జి, ప్రియాంక ఖర్గే నడిచారు. కర్ణాటకలో మొత్తం 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర.. 2023 జనవరి 30న జమ్ములో ముగియనునన్నది. ఆ యాత్రలో భాగంగా మొత్తం 3వేల 570 కిలోమీటర్ల మేర రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. 

Tags:    

Similar News