Rahul Gandhi: వర్షంలోనూ తడుస్తూ.. సభలో ప్రసంగం
*కుర్చీలనే గొడుగులుగా మార్చుకున్న నాయకులు, కార్యకర్తలు
Rahul Gandhi: వర్షంలోనూ తడుస్తూ.. సభలో ప్రసంగం
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలోని మైసూర్ లో కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలో అభిమానంతో తరలి వచ్చారు. బండిపాళ్య ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభ జరుగుతున్న సమయంలోనే భారీ వర్షంకురిసింది. రాహుల్ గాంధీ మంచి సంకల్పంతో వర్షంలో తడుస్తూనే మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు వర్షంలో తడుస్తూ నిలబడినా.. మరికొందరు అక్కడి సభలో కుర్చీలనే గొడుకులుగా మార్చుకుని రాహుల్ మాటలను ఆసక్తిగా విన్నారు. వర్షంలో తమ అగ్రనాయకుడే.. తడిస్తే.. తామూ తడవడంలో తప్పులేదని వర్షంలో తడిచి వినయ విధేయతలను చాటారు.